: ఎన్నికల్లోపు తెలంగాణ ఏర్పడుతుంది.. సీఎం కొత్త పార్టీ పెట్టరు: ఆజాద్
లోక్ సభ ఎన్నికల్లోపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తవుతుందని కేంద్ర మంత్రి ఆజాద్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ముఖ్యమంత్రి అని, ఆయన కొత్త పార్టీ ఎందుకు పెడతారని ప్రశ్నించారు. అసెంబ్లీకి 42 రోజుల గడువు నిర్ణయించి బిల్లును పంపించామని, నిర్ణీత గడువులోగా చర్చ పూర్తి చేసి బిల్లును రాష్ట్రపతికి తిరిగి పంపించాలని ఆయన సూచించారు. అప్పుడు విభజన ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు బిల్లును ఆమోదిస్తారో, వ్యతిరేకిస్తారో వారి ఇష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 13 నాటికి పోలియో రహిత దేశంగా భారత్ అవతరించనుంది అని ఆజాద్ తెలిపారు.