: ఆరు జిల్లాలో పర్యటించాలని టీ.టీడీపీ నేతల నిర్ణయం
తెలంగాణ టీడీపీ నేతల సమావేశం ముగిసింది. ఈ నెలఖారులోపు ఆరు జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం నేతల బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో నల్గొండలో ప్రజాగర్జన సభ ఏర్పాటు చేయనున్నారు.