: ప్రజారాజ్యం పార్టీని పునరుద్ధరించే ఆలోచన లేదు: చిరంజీవి
ప్రజారాజ్యం పార్టీని పునరుద్ధరించే ఆలోచన లేదని కేంద్ర మంత్రి చిరంజీవి తెలిపారు. కాంగ్రెస్ వల్ల సామాజిక న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని ఢిల్లీలో చెప్పారు. సమైక్యవాదం ముసుగులో లాభం పొందాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయన్నారు. తాను రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని, అనివార్యమైతే హైదరాబాద్ ను యూటీ చేయాలని మంత్రి పునరుద్ఘాటించారు. యూటీ చేసినప్పుడే సీమాంధ్రుల్లో అసంతృప్తి తొలగుతుందని పేర్కొన్నారు. కాగా, విభజన బిల్లుపై శాసనసభలో చర్చ జరిగితే బాగుంటుందని.. కానీ, చర్చకు వైఎస్సార్సీపీ సభ్యులు సహకరించడంలేదని చిరు అన్నారు.