: విమాన ప్రయాణికులు బెల్టులు, షూ తీసేయాలి!
ఇతర దేశాలలో వలే త్వరలో మన దేశంలోనూ విమాన ప్రయాణికులు తనిఖీల సందర్భంగా బెల్టులు, షూ తీసేయాల్సి ఉంటుంది. ప్రయాణికులు తనిఖీల సందర్భంగా వారి వద్ద ఎటువంటి మెటల్ వస్తువులు ఉంచుకోవడానికి వీల్లేకుండా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ (బీఏసీఎస్) నిబంధనలు మారుస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ కొత్త విధానం అమల్లో పెట్టారు.
ఫలితాలను చూసి తగిన మార్పులతో దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలలోనూ ఇదే విధానాన్ని అమలులోకి తేవాలని బీఏసీఎస్ భావిస్తోంది.పాశ్చాత్య దేశాలలో విమాన ప్రయాణికులు తప్పనిసరిగా బెల్టులు, షూ, ల్యాప్ టాపులు తదితర వస్తువులన్నింటినీ తనిఖీల సందర్భంగా అప్పగించే విధానం అమలులో ఉంది.