: భవిష్యత్తుపై బెంగ వద్దు: ప్రధాని
గత కొన్ని త్రైమాసికాలుగా వృద్ధిలో వెనకడుగులు వేస్తున్నా.. కలతవద్దని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. 12వ ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని ఈ రోజు ఢిల్లీలో ప్రధాని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంలో వృద్ధి దిశగా భారత్ సాధించిన దాన్ని కొన్ని త్రైమాసికాలుగా కోల్పోతుందన్న అభిప్రాయాలు ఉన్నాయన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితులపై నిరాశ గానీ, భవిష్యత్తుపై ఆందోళనగానీ చెందాల్సిన అవసరం లేదని అభయమిచ్చారు.