: కోల్ స్కామ్ లో మరో రెండు కేసులు నమోదు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాజాగా మరో రెండు కేసులు నమోదు చేసింది. ఈ మేరకు ఎన్డీఏ హయాంలో కోల్ బ్లాక్ లు పొందిన రెండు కంపెనీల పేర్లను పేర్కొంది. ఈ నేపథ్యంలో బీఎల్ఏ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, గ్యాస్ట్రోన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లతో బాటు, బొగ్గు శాఖకు చెందిన ఇద్దరు అధికారులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.