: ఆధారాలు, విచారణ లేకుండా గంగూలీ రాజీనామా బాధించింది: సోమ్ నాథ్ ఛటర్జీ


పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమీషన్ చైర్మన్ పదవికి జస్టిస్ ఏకే గంగూలీ రాజీనామా చేయడం తనను బాధించిందని లోక్ సభ మాజీ స్పీకర్ సోమ్ నాథ్ ఛటర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. కోల్ కతాలో ఆయన మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు లేకుండా, విచారణ జరుపకుండా కమీషన్ నుంచి వైదొలగడం సరైన సంప్రదాయం కాదని అభిప్రాయపడ్డారు. మన న్యాయవ్యవస్థలో ఎవరిమీదైనా తప్పు చేశారని ఆరోపణలు వచ్చినప్పడు అవి నిర్థారణ కావాలని, లేని పక్షంలో అతను నిర్థోషేనని అన్నారు. త్రిసభ్యకమిటీ దర్యాప్తు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఆయన ఆరోపించారు. గంగూలీ సుప్రీంకోర్టు జడ్జీగా పని చేసినప్పుడు కూడా ఎవరూ ఆయనను అనుమానించలేదని ఆయన గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News