: ఈ నెల 19 నుంచి ఎల్పీజీ డీలర్ల నిరవధిక సమ్మె!
చమురు సంస్థలు కొత్త డిస్ట్రిబ్యూటర్లను నియమించడం అపివేయడంతో సమ్మె చేయాలని ఎల్పీజీ డీలర్లు నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 19 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 15వ తేదీ నుంచి అన్ని ఉత్పత్తుల అమ్మకాలను ఆపివేయాలని తమ సభ్యులను భారతదేశ ఎల్పీజీ పంపిణీదారుల ఫెడరేషన్ ఆదేశించింది. తమ డిమాండ్లకు అంగీకరించకపోతే సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు.