: సంపూర్ణంగా లేని బిల్లుపై చర్చించలేం: యనమల
సంపూర్ణంగా లేని టీబిల్లుపై చర్చను ఎలా చేపడతామని టీడీపీ సీనియర్ నేత యలమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఈ విషయాన్ని మంత్రులు కూడా అంగీకరిస్తున్నారని చెప్పారు. తప్పుల తడకలా ఉన్న బిల్లును వెంటనే తిప్పి పంపాలని... బిల్లు సంపూర్ణంగా వచ్చినప్పుడే దానిపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు.