: కాంగ్రెస్ సీనియర్ నేతలతో రాహుల్ గాంధీ భేటీ
ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్ నేతలతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక భేటీ ఏర్పాటుచేశారు. ఈ భేటీలో రాహుల్ సోదరి ప్రియాంక కూడా పాల్గొన్నారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్రమంత్రి జైరాం రమేశ్, పార్టీ సీనియర్ నేత జనార్ధన్ ద్వివేది సమావేశంలో ఉన్నారు. ఈ నెల 17 నుంచి ఏఐసీసీ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.