: భారతీయ శాస్త్రవేత్తకు ఐదేళ్ల గ్రాంట్
ఇండో అమెరికన్ న్యూరో సైంటిస్ట్ ఖలీల్ రజాక్ 'యు.ఎస్.డి. ఫ్యాకల్టీ ఎర్లీ కెరీర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ గ్రాంట్'కు ఎంపికయ్యారు. వృద్ధాప్యంలో వినికిడి సమస్యలు, ఫ్రాగిల్ ఎక్స్ సిండ్రోమ్ (ఎఫ్.ఎక్స్.ఎన్) తదితరాలకు సంబంధించి ఖలీల్ పరిశోధనలు చేస్తున్నారు. ఆయన పరిశోధనలను ప్రోత్సహిస్తూ 8 లక్షల 67 వేల డాలర్ల గ్రాంట్ లభించింది. తమిళనాడు రాజధాని చెన్నైకు చెందిన ఆయన యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్ సైడ్ (యుసిఆర్)లో సైకాలజీ, న్యూరో సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నారు. తన ప్రయోగశాలలో ధ్వని, మెదడులో చోటు చేసుకునే ప్రక్రియలపై పరిశోధనలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. తన పరిశోధనలు థెరపీలకు ఉపయోగపడే విధంగా ఉంటాయని ఆయన చెప్పారు. ముసలితనంలో వచ్చే వినికిడి సమస్యలను తప్పక నివారించవచ్చని ఖలీల్ పేర్కొన్నారు.