: శ్రీవారిని దర్శించుకున్న జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి సతీమణి
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సతీమణి పాయల్ నాథ్ తమ ఇద్దరు కుమారులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. తాము హిందూ మతాన్ని గౌరవిస్తామని ఈ సందర్భంగా టీటీడీకు డిక్లరేషన్ సమర్పించారు. అంతకుముందు కంచిమఠం పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం పదకొండు గంటలకు వీఐపీ దర్శన సమయంలో తన శిష్య బృందంతో కలసి దర్శించుకున్నారు. అదే సమయంలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి సచిన్ ఫైలట్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.