: రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటా: ధర్మాన
తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానా? లేక పార్టీ మారతానా? అన్న విషయమై త్వరలోనే స్పష్టత ఇస్తానని, ప్రజాభిప్రాయాన్ని అనుసరించి తగిన నిర్ణయం తీసుకొంటానని ఆయన పేర్కొన్నారు. తనపై వస్తున్న ఊహాగానాలకు సంబంధించి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలను అడగాల్సి ఉందని ధర్మాన చెప్పారు.