: 'బై వీక్లీ ఎక్స్ ప్రెస్' పేరు ఇకపై 'సెవెన్ హిల్స్'
సికింద్రాబాద్- తిరుపతిల మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టిన 'బై వీక్లీ' సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ పేరు మారనుంది. ఇక నుంచి ఈ రైలును 'సెవెన్ హిల్స్' ఎక్స్ ప్రెస్ గా వ్యవహరించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ రైలు మంగళ, శనివారాల్లో సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 5.40 గంటలకు 12770 నెంబరుతోను, శుక్ర, శనివారాల్లో తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు 12769 నెంబరుతోను నడవనుంది.