: కోలుకుంటున్న సంగీత దర్శకుడు ఇళయరాజా
స్వల్ప గుండెపోటుతో అనారోగ్యానికి గురైన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మలేషియాలో నిర్వహించిన సంగీత కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన ఆయన... చెన్నై నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిమానులను అలరించారు. కొత్త ఏడాదిలో తమ అభిమాన సంగీత దర్శకుడిని చూసిన అభిమానులు కూడా సంతోషించారు. అంతేగాక తమిళ గీత రచయిత స్నేహన్ హీరోగా నటిస్తున్న 'రాజరాజ చోళనిన్ పోర్ వాల్' చిత్రానికి నిన్న (సోమవారం) ఇళయరాజా స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ థియేటర్ లో పాటలను రికార్డింగ్ చేశారు. నూతన సంవత్సరంలో తొలిసారిగా ఇళయరాజా తమ సినిమాకు సంగీతాన్ని అందించడం ఆనందంగా ఉందని చిత్ర యూనిట్ పేర్కొంది.