: పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి నాకు లేదు: సల్మాన్ ఖాన్
బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న సల్మాన్ ఖాన్(48) పెళ్లి కోసం, ఎంతోకాలంగా అందరూ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తనకు మాత్రం వివాహం చేసుకోవాలన్న ఆసక్తి లేదని సల్మాన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తాను ఒక్కడిగానే బాగున్నానని, ముప్పై ఏళ్ల నుంచి అలానే ఉంటున్నానని సల్మాన్ వివరించాడు. ఇలా ఉండటాన్నే తాను ఇష్టపడుతున్నట్లు ఓ ఆంగ్ల చానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తానెప్పుడు మహిళలను గౌరవిస్తానని చెప్పాడు. దీనిని బట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా సల్మాన్ పెళ్లి చేసుకుంటాడన్న ఆలోచనను స్నేహితులు, అభిమానులు ఇక మరచిపోక తప్పదు.