: ఉదయ్ కిరణ్ కు ప్రముఖుల నివాళి
శ్రీనగర్ కాలనీలోని నివాసం నుంచి ఫిలిం ఛాంబర్ కు తరలించిన సినీ హీరో ఉదయ్ కిరణ్ భౌతిక కాయానికి సినీ ప్రముఖులు నివాళి అర్పించారు. రామానాయుడు, జయసుధ, పరుచూరి బ్రదర్స్, శివాజీ రాజా, హీరోలు, శ్రీకాంత్, శివాజీ, నాని, నిర్మాత డి.సురేష్ బాబు తదితరులు ఉదయ్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ మొత్తం సినీ పరిశ్రమకు చెందిన వారు, అభిమానులతో కిటకిటలాడుతోంది.