: కోట్ల మందికి సంబంధించినది.. ఓటింగ్ జరగాల్సిందే: ధూళిపాళ్ల నరేంద్ర
కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన బిల్లుపై ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే కుదరదని... సభలో బిల్లుపై ఓటింగ్ నిర్వహిస్తేనే సభ్యుల అభిప్రాయాలు కరెక్ట్ గా తెలుస్తాయని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కిమార్ రెడ్డి బీఏసీ సమావేశంలో ఒకటి మాట్లాడతారని... బయట మరొకటి చెబుతారని విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్న చాలా మంది మంత్రులు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ, దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ధూళిపాళ్ల ఆరోపించారు.