: ఈ ప్యాచ్‌ వెరీ స్మార్ట్‌


ఏవైనా గాయాలయిన తర్వాత లేదా శస్త్ర చికిత్సలు చేసిన తర్వాత గాయాలు మానడానికి పట్టీలు వేస్తుంటారు. అన్ని పట్టీలు సమర్ధవంతంగా పనిచేయలేవు. కానీ ఈ పట్టీమాత్రం వెరీ స్మార్ట్‌ అని దీన్ని తయారుచేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే, ఈ పట్టీ చక్కగా దెబ్బతిన్న కణజాలం వేగంగా కోలుకునేలా చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక కొత్తరకం స్మార్ట్‌ ప్యాచ్‌ను తయారుచేశారు. ఈ ప్యాచ్‌ భుజానికి అయ్యే గాయాలను తగ్గించడంలో చాలా మెరుగ్గా పనిచేస్తుందని చెబుతున్నారు. సాధారణంగా భుజానికి అయిన గాయాలను మాన్పేందుకు చేసే శస్త్రచికిత్స తర్వాత వేసే సాధారణ పట్టీలు చాలా కేసుల్లో విజయవంతం కావడం లేదని, ఈ రకమైన కేసులు యూకేలో ఏడాదికి దాదాపు మూడు లక్షల వరకూ నమోదవుతున్నాయని, అయితే దాదాపు 25 నుండి యాభై శాతం కేసుల్లో శస్త్రచికిత్స ఫెయిలవుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనికి కారణం శస్త్రచికిత్స చేసిన స్థానంలో వేసిన ప్యాచ్‌ దెబ్బతిన్న భాగాలను సరిగ్గా మరమ్మత్తు చేయకపోవడమేనని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి కేసులకు చేసే శస్త్రచికిత్సల్లో మరింత మెరుగైన ఫలితాలను అందించడానికి తాము ఈ కొత్త స్మార్ట్‌ ప్యాచ్‌ను తయారుచేశామని పరిశోధకులు తెలిపారు. తాము తయారుచేసిన స్మార్ట్‌ ప్యాచ్‌ దెబ్బతిన్న కణజాలం వేగంగా కోలుకునేందుకు సహాయపడుతుందని, ఇందుకు అవసరమైన పదార్ధాలను ఉపయోగించి రెండు పొరలతో దీన్ని రూపొందించామని పరిశోధకులు తెలిపారు.

  • Loading...

More Telugu News