: తిరుమలలో మౌలిక వసతులు కల్పించాలి


ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తులకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉందని పార్లమెంటరీ స్థాయి సంఘం సూచించింది. టి.సుబ్బరామిరెడ్డి చైర్మన్ గా ఉన్న ఏడుగురు ఎంపీలతో కూడిన స్థాయీ సంఘం తిరుమలలో పర్యటించింది. ఈ సందర్భంగా తిరుమలలో కాలుష్యానికి గల కారణాలను విశ్లేషించింది. అనంతరం టీటీడీ అధికారులతో సమావేశమై కాలుష్యాన్ని తగ్గించేందుకు పలు సూచనలు చేసింది. ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు పలు చర్యలు చేపట్టాలని పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొంది.

  • Loading...

More Telugu News