: ఇస్రో పంపిన మామ్ తో సైన్స్ లో కొత్త కోణాలు: నాసా శాస్త్రవేత్త
ఇస్రో నుంచి భారత శాస్త్రవేత్తలు పంపించిన మామ్ ఉపగ్రహం సైన్స్ లో కొత్త కోణాలు వెలికి తీసేందుకు చాలా ఉపయోగపడుతుందని నాసా శాస్త్రవేత్త మైఖేల్ మేయర్ తెలిపారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, అంగారక గ్రహంపైకి తాము పంపిన క్యూరియాసిటీ రోవర్ విజయవంతంగా పనిచేస్తోందని ఆయన అన్నారు. ఈ నెలలో రోవర్ పదో వార్షికోత్సవాన్ని జరుపుకోబోతోందన్న ఆయన, 2020లో అంగారక గ్రహంపైకి మరో రోవర్ ను పంపేందుకు నాసా సన్నాహాలు చేపట్టిందని తెలిపారు.