: తమిళనాడులోని నటరాజ ఆలయం నిర్వహణాధికారాలు పూజారులకే: సుప్రీం
తమిళనాడులోని చిదంబరంలో ఉన్న ప్రముఖ నటరాజ ఆలయ నిర్వహణను పూజారులకు అప్పగిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దానిపై ఇకనుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవని స్పష్టం చేసింది. వెయ్యేళ్లనాటి ఈ ఆలయం నలభై ఎకరాల్లో ఉంది. 2009లో ఈ ఆలయ నిర్వహణాధికారాలను అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎమ్.కరుణానిధి ప్రభుత్వానికి బదిలీ చేస్తూ మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. గుడికి వస్తున్న సంపదలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలతో అప్పుడు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం తీర్పును ఆలయ పూజారులు సుప్రీంలో సవాల్ చేశారు.