: హైదరాబాద్ లో తనిఖీలు.. పేలుడు పదార్థాలు స్వాధీనం
హైదరాబాద్ లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాల తనిఖీతో పాటు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాతబస్తీలో ఒక ఇంటి నుంచి పేలుడు పదార్థాలను భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. 400 జిలెటిన్ స్టిక్కులు, 300కు పైగా డిటోనేటర్లు పోలీసులకు చిక్కాయి. వీటిని నిల్వ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.