: రెజ్లర్ సుశీల్ కుమార్ కు కవల పిల్లలు


భారత రెజ్లర్ సుశీల్ కుమార్ తండ్రయ్యాడు. అతని భార్య సావి నిన్న (ఆదివారం) సాయంత్రం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో మగ కవలలకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా సుశీల్ మాట్లాడుతూ.. ఇది తనకు మరపురాని రోజన్నాడు. దేవుడు తనకెప్పుడు రెండు సంతోషాల్నిస్తాడని తెలిపాడు. మొదట ఒలింపిక్స్ లో రెండు పతకాలు ఇచ్చాడని, ఇప్పుడు కవల పిల్లలను ఇచ్చాడన్నాడు. ఇది తనకు అత్యంత ఆనందాన్నిచ్చే విషయమని చెప్పాడు.

  • Loading...

More Telugu News