: బీబీ నగర్ లో భారీ అగ్నిప్రమాదం.. 18 కోట్ల ఆస్తి నష్టం


నల్గొండ జిల్లా బీబీనగర్ లోని శ్రీయం అగ్రోకెమికల్ ఫ్యాక్టరీలో ఇవాళ భారీ అగ్నిప్రమాదం జరిగింది. కంపెనీ ఆవరణలో మిసైల్ ట్యాంకర్ ను అన్ లోడ్ చేస్తుండగా స్పార్క్ తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే చౌటుప్పల్, బీబీనగర్ ల నుంచి వచ్చిన నాలుగు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 18 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశామని ఆర్డీవో తెలిపారు. భువనగిరి రూరల్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బీబీనగర్ పట్టణానికి ఈ కంపెనీ ఆనుకుని ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పరిసర ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.

  • Loading...

More Telugu News