: నెల రోజుల నుంచి ఇంటికే పరిమితమైన ఉదయ్ కిరణ్
సినీ హీరో ఉదయ్ కిరణ్ అకాల మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉదయ్ మరణ వార్త విని సహనటులు కూడా దిగ్ర్భాంతికి గురయ్యారు. ఉదయ్ కిరణ్ నెల రోజుల నుంచి ఇంటికే పరిమితమైనట్టు తెలిసింది. కారుడ్రైవర్, వంట మనిషిని రెండు నెలల క్రితమే మాన్పించివేశారు. దాంతో గత రెండు నెలల నుంచి ఆయన రెండు కార్లను బయటకు తీయలేదు. సెల్లార్ లోని కారు దుమ్ము కొట్టుకునిపోయి కనిపించింది. రెండు నెలలుగా ఆయన పాలు కూడా తీసుకోలేదు. గత రెండు, మూడు రోజుల నుంచి ఉదయ్ కిరణ్ ఇంటి నుంచి బయటకి రాలేదని అపార్ట్ మెంట్ వాసులు చెప్పారు.