: గోవాలో భవనం కూలిన ఘటనలో 17 మంది మృతి
రెండు రోజుల కిందట (శనివారం) గోవాలోని కనాకోనాలోని నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటన తెలిసిందే. ఆ సమయంలో నలభైమందికి పైగా కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. అదేరోజు ఎనిమిదిమంది మరణించగా ఇప్పుడా సంఖ్య 17 మందికి చేరింది. ప్రస్తుతం శిథిలాల తొలగింపు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇంకా పన్నెండు మందికి పైగా శిథిలాల కింద ఉన్నట్లు భావిస్తున్నారు.