: భారత్ ఇటలీ మధ్య ముదురుతున్న 'నావికా' వివాదం


కేరళ తీరంలో ఇద్దరు జాలర్లను చంపిన హత్య కేసులో దోషులైన ఇద్దరు ఇటలీ నావికాదళ గార్డులను భారత్ కు అప్పగించే విషయం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. వీరిని భారత్ కు పంపరాదని ఇటలీ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కఠిన చర్యలు తీసుకుంటామని, దౌత్య సంబంధాలపైనా ప్రభావం పడుతుందని ప్రధాని ఇప్పటికే స్పష్టం చేశారు.

ఇటలీ రాయబారి భారత దేశం విడిచి వెళ్లరాదని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ విచారించిన న్యాయస్థానం పై ఆదేశాలు జారీ చేసింది. గార్డులను భారత్ కు పంపరాదన్న ఇటలీ నిర్ణయంపై కోర్టుకు వివరణ ఇవ్వాలని కోరింది.
 
సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇటలీ రాయబారి డానియెల్ మాన్సినికి తెలిపారు. ఆయన సుప్రీం సమన్ల ప్రతిని స్వీకరించారు కానీ, వాటిని పాటించడానికి నిరాకరించారు. మరోవైపు ఇటలీ కూడా తమదేశ రాయబారి స్వేచ్ఛగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా పర్యటించగలరని స్పష్టం చేసింది. అసలు తమ గార్డులపై భారత్ లో ఎటువంటి అభియోగాలూ లేవని, కేరళ కోర్టు వాటిని కొట్టేసిందని పేర్కొంది.
 
మరోవైపు ఇటలీ నావికాదళ గార్డులను భారత్ కు పంపకుంటే నిబంధనల ప్రకారం, ప్రధాని ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. 

  • Loading...

More Telugu News