: ముఖ్యమంత్రిని కలిసిన ఖమ్మం జిల్లా టీడీపీ నేతలు
ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ ప్రజా ప్రతినిధులు ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఖమ్మం జిల్లాలో సింగరేణి భూసేకరణకు సంబంధించి నూతన భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు. జనవరి 1నుంచి కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వస్తే.. అంతకు రెండు రోజుల ముందు కలెక్టర్ భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారని ఫిర్యాదు చేశారు.