: బెడిసికొట్టిన టీఆర్ఎస్ 'అవిశ్వాసం'
మొత్తానికి అవిశ్వాస తీర్మానం అంశం మరింత రచ్చ రచ్చగా తయారైంది. టీఆర్ఎస్ తీసుకొచ్చిన అవిశ్వాస ప్రతిపాదనకు వైఎస్సార్ కాంగ్రెస్ జై కొట్టింది. కానీ, శాసనసభలో మాత్రం సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ విడివిడిగా నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగితే తటస్ఠంగా ఉండాలని పార్టీ ఎమ్మెల్యలందరికీ విప్ జారీ చేసింది.
దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమని తేలిపోయింది. ఎందుకంటే టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ ల బలం తక్కువగా ఉండడమే. దీంతో టీఆర్ఎస్ తెలుగుదేశం నిర్ణయంపై మండిపడుతోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ నిర్ణయంతో ముఖ్యమంత్రి కిరణ్ ఊపిరి పీల్చుకున్నారు. సభలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఎన్నో అవకాశాలుండగా అవిశ్వాస తీర్మానం కోసం పాకులాడడం సరికాదన్నారు. తమ ప్రత్యర్థి టీడీపీయేనని స్పష్టం చేశారు.