: ఆన్‌లైన్లోనే టేస్టు చూసేయవచ్చు!!
టేస్టు చూడడం అనేది నేరుగా జరిగేపని. ఏదైనా వంటకాన్ని రుచి చూడాలంటే చక్కగా దాన్ని తిని, దాని రుచిని ఆస్వాదించి తర్వాత అది ఎలావుంది? అనే విషయాన్ని చెబుతాం. అలాకాకుండా ఆన్‌లైన్లో రుచి చూడడం ఏంటి... అనుకుంటున్నారా... త్వరలోనే ఇలాంటి కంప్యూటర్ పరికరాలు రాబోతున్నాయి. ఆన్‌లైన్‌లోనే రకరకాల వంటకాల రుచిని మీకు ఆస్వాదింపజేయడానికి అవి సిద్ధమవుతున్నాయి.
సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయంలో నిమేషా రణసింగీన్ అనే ఒక శాస్త్రవేత్త ఒక సరికొత్త పరికరాన్ని కనిపెట్టారు. ఈ పరికరం మనకు ఆన్‌లైన్‌లోనే రుచులన్నింటినీ చూపిస్తుందని చెబుతున్నారు. ఈ పరికరం ఆన్‌లైన్‌లో కనిపించే ఆహార పదార్ధాల రుచిని మీకు తెలుపుతుందట. ఈ పరికరం మొనని నాలుకపై పెట్టుకుంటే దానికి అందే సిగ్నళ్ల ఆధారంగా మనం చక్కగా ఆరు రుచులను ఆస్వాదించవచ్చట. ఇందుకోసం నిమేషాగారు టేస్ట్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్‌ను కూడా సృష్టించారు. మొత్తానికి కంప్యూటర్ ముందే కూర్చుని అన్నీ రుచి చూసేయవచ్చన్నమాట!