: అశోక్ బాబు ప్యానల్ ఘన విజయం


ఏపీఎన్జీవో సంఘానికి జరిగిన ఎన్నికల్లో అశోక్ బాబు ప్యానల్ ఘనవిజయం సాధించింది. అశోక్ బాబు కు 638 ఓట్లు రాగా, బషీరుద్దీన్ కు 164 ఓట్లు వచ్చాయి. కాగా 13 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ తనపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలకు ఈ ఫలితాలే సమాధానమని అన్నారు. తమ నాయకత్వం ఉన్నంతకాలం సమైక్యాంధ్ర కోసం పోరాడుతామని తెలిపారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News