: ఉద్యమానికి సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు రె'ఢీ'
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మరోసారి ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు 6 న అన్ని రాజకీయ పక్షాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. జెండాలు, అజెండాలు పక్కన పెట్టి సమైక్యాంధ్రే ధ్యేయంగా అందరూ ముందుకు రావాలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్ మురళీకృష్ణ పిలుపునిచ్చారు.