: కోటీశ్వరుడైన ప్యూను
ఆరు భవంతులు, ఐదు ప్లాట్లు. అందులో ఒక ప్లాట్ విస్తీర్ణం ఐదెకరాలు. వీటి విలువ రెండు కోట్ల రూపాయలకుపైనే.ఈ ఆస్తులు ఎవరివీ అనుకుంటున్నారా? ఒక సామాన్య ప్యూనువి.
బెంగళూరు మహా నగరపాలక సంస్థలో పనిచేసే ప్యూను దగ్గర ఆస్తులు దండిగా ఉన్నాయంటూ కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు వచ్చింది. దీంతో పోలీసులు గురువారం ఆ ప్యూను ఇంట్లో సోదాలకు దిగారు. తనిఖీలలో భాగంగా 2.2 కోట్ల రూపాయల ఆస్తులు అతడికి ఉన్నట్లు కనుగొని నోరెళ్లబెట్టారు. ప్యూనా మజాకా! పెరిగిపోతున్న అవినీతికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.