: ఇంటర్ పరీక్షలలో కాపీయింగ్ పై విచారణ
ఇంటర్ పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరిగిందన్న ఆరోపణలపై విచారణకు ఇంటర్ బోర్డు ఆదేశించింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరుగుతున్న మాస్ కాపీయింగ్ ను ఒక మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది. దీంతో వైష్ణవి, విద్వాన్ కళాశాలలపై విచారణకు ఆదేశిస్తూ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. విచారణలో కాపీయింగ్ జరిగిందని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.