: 140 గుడిసెలను కూల్చేసిన 200 మంది గూండాలు


హైదరాబాద్, ఎల్బీనగర్ లోని ఆదివాసీ నగర్ లో గూండాలు స్వైరవిహారం చేశారు. అర్థరాత్రి 200 మంది గూండాలు ఆదివాసీ తండామీద విరుచుకుపడి 140 గుడిసెలను కూల్చేశారు. దీంతో అక్కడ నివాసముంటున్న వారంతా నిరాశ్రయులయ్యారు. భూకబ్జాకు పాల్పడే గూండాలే ఈ పనికి పూనుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుడిసెలపై దాడులకు దిగిన వారికి కాంగ్రెస్, టీడీపీ లకు చెందిన నేతల మద్దతు ఉందని, వారే ఈ దమనకాండకు పూనుకున్నారని అంటున్నారు. తమకు న్యాయం జరగకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ఆదివాసీ నగర్ వాసులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News