: ఏడుపులు, పెడబొబ్బలకు దారితీసిన దొంగా పోలీస్ ఆట
దొంగ- పోలీస్ ఆట తెలియని చిన్నారులుండరు. వారికదో సరదా గేమ్. అమెరికాలోని ఉతా పట్టణంలో ఇలానే 11ఏళ్ల బాలిక తన సోదరి, కజిన్స్ తో కలిసి దొంగా, పోలీస్ ఆట ఆడుతోంది. తనను ఎవరూ గుర్తించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ బాలిక వాషింగ్ మెషిన్లో దూరేసింది. వెంటనే డోర్ లాక్ అయింది. దాంతో కొంత సేపటికి లోపలి నుంచి బయటకు రావడానికి ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో కేకలు వేయడం మొదలు పెట్టింది. వాళ్ల అమ్మ వచ్చి ఎంత ప్రయత్నించినా డోర్ తెరచుకోలేదు. దీంతో అత్యవసర సేవల విభాగానికి ఫోన్ చేయగా.. వారొచ్చి బాలికను బయటకు తీశారు. అలా 90 నిమిషాల పాటు బాలిక వాషింగ్ మెషిన్ లోపల భయపడుతూ గడిపింది.