: జబ్బార్ ట్రావెల్స్ ఎదుట ఓయూ విద్యార్థుల ఆందోళన
పాలెం ప్రమాదబాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఓయూ జేఏసీ విద్యార్థులు హైదరాబాద్ లోని జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. ప్రమాదంలో 45 మంది సజీవ దహనమైపోతే ప్రభుత్వం, ట్రావెల్స్ యాజమాన్యం వారికి న్యాయం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విద్యార్థులు మండిపడ్డారు. తక్షణం బాధితులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో జబ్బార్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. వీరికి లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ మద్దతు తెలిపారు.