: తలకోనలో మంత్రి కొడుకు అనుచరుడి రౌడీయిజం


పర్యాటక ప్రాంతమైన చిత్తూరు జిల్లా తలకోనలో మంత్రి కొడుకు అనుచరుడు, మరికొందరు తాగుబోతులు టీటీడీ గెస్ట్ హౌస్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. మద్యం, మాంసం తెచ్చుకున్న వారిని ప్రశ్నించిన గార్డెనర్ శంకరయ్య, మరో ముగ్గురు సిబ్బందిపై రెచ్చిపోయి ఇనుపరాడ్లతో దాడి చేయడంతో గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన స్థానికులపై కూడా దాడి చేశారు. దీనిపై గెస్ట్ హౌస్ మేనేజర్ శ్రీనివాస్ ఎర్రవారిపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన దుండగుల్లో జిల్లా మంత్రి అనుచరుడు ఒకరున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News