: ఆంగ్లానికి ఎందుకంత ప్రాధాన్యం?: నితీష్ కుమార్


యూపీఎస్సీ పరీక్షల్లో విదేశీభాష అయిన ఆంగ్లానికి ఎందుకు అంత ప్రాముఖ్యం? అని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మండిపడ్డారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ యూపీఎస్సీ పరీక్షల్లో ఆంగ్లానికి ప్రాధాన్యత పెంచుతుండడం శోచనీయమని అన్నారు. 2011, 2013ల్లో పరీక్షా విధానంలో యూపీఎస్సీ మార్పులు తెచ్చి ఆంగ్లానికి పెద్దపీట వేయడంతో ఆంగ్ల మాధ్యమంలో చదవని విద్యార్థులకు కష్టంగా మారిందని అన్నారు.

దేశప్రజలపై ఆంగ్లాన్ని రుద్దేందుకు అధికారగణం ఎంతగానో ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. జనజీవితంలోనూ, రాజకీయాల్లోనూ ఆంగ్లం వల్ల ఒనగూరే ప్రయోజనం లేదని సూచించారు. దేశభాషల్లో చదివిన విద్యార్థులు నష్టపోకుండా చూడాల్సిన అవసరం దేశంలో అన్ని ప్రభుత్వాలపై ఉందని, అది కేంద్ర ప్రభుత్వంపై మరింత ఎక్కువ ఉందని గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News