: సభను అడ్డుకుంటే రాతపూర్వక అభిప్రాయాలు తెలుపుతాం: గండ్ర
సోమవారం నుంచైనా అసెంబ్లీని అడ్డుకోకుండా సజావుగా సాగనివ్వాలని ప్రభుత్వ చీఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి ప్రతిపక్షాలను కోరారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సభను ఇలాగే అడ్డుకుంటే తెలంగాణ ప్రాంత సభ్యులంతా లిఖితపూర్వకంగా సభాపతికి తమ అభిప్రాయాలు తెలుపుతామని హెచ్చరించారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చి 11 రోజులు గడిచిపోయాయని, సమస్యలపై సభ్యులు చర్చించాలని ఆయన సూచించారు.