: లోక్ సభ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల నుంచి ఏఏపీ పోటీ చేస్తుందట!
మరో మూడు నెలల్లో దేశంలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల నుంచి ఏఏపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ తెలిపారు. ఈ మేరకు ఆయా రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో పోటీచేసే అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వారిని తీసుకుంటామన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీకు ప్రత్యామ్నాయాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.