: ఆయుర్వేద పంచకర్మ పుస్తకాన్ని ఆవిష్కరించిన జస్టిస్ ఈశ్వరయ్య
ఆయుర్వేద పంచకర్మ చికిత్స ద్వారా దీర్ఘకాల వ్యాధులను సైతం నయం చేయవచ్చునని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య చెప్పారు. ఆయుర్వేదం అద్భుతమైన భారతీయ వైద్య విధానమని, అందుకే మన పూర్వీకులు ఆయుర్వేదంపైనే ఆధారపడేవారని ఆయన అన్నారు. ఆకృతి రూపొందించిన ఆయుర్వేద పంచకర్మ పుస్తకాన్ని ఆయన హైదరాబాదులో ఈరోజు ఆవిష్కరించారు. నగర యాంత్రిక జీవనంలో మనిషి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. దైనందిన జీవితంలో అనేక మంది శారీరక రుగ్మతల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని జస్టిస్ ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుర్వేదం చికిత్సతో మనిషి చిరకాలం ఆరోగ్యంగా జీవించవచ్చునన్నారు.