: ‘గాన్ విత్ ది విండ్’ సినిమాలో నటించిన అలీషియా రెట్ కాలధర్మం


హాలీవుడ్ క్లాసిక్ ‘గాన్ విత్ ది విండ్' తారాగణంలో జీవించి ఉన్న చివరి నటి అలీషియా రెట్ తన 98వ ఏట సౌత్ కరోలినాలో కాలధర్మం చెందారు. వివియన్ లీ, క్లార్క్ గేబల్ జంటగా నటించిన ‘గాన్ విత్ ది విండ్’ సినిమా 1939లో విడుదలైంది. ఈ సినిమాలో ఇండియా విల్కెస్ పాత్రలో అలీషియా రెట్ నటించారు. జార్జియా దేశంలోని సవన్నా ప్రాంతంలో 1915, ఫిబ్రవరి ఒకటో తేదీన ఆమె జన్మించారు. అలీషియా సహజ నటి, పోర్ట్రెయిట్ చిత్రకారిణి. రెట్ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు సహనటుల పోర్ట్రెయిట్ చిత్రాలను ఆమె అద్భుతంగా వేసేవారు. అలీషియా రెట్ 2002 ఆగస్టు నుంచి చార్లెస్టన్ లో బిషప్ గాడ్స్ డెన్ లో ని రిటైర్ మెంట్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. అలీషియా రెట్ శుక్రవారం సాయంత్రం మరణించారని ఆ కమ్యూనిటీ మహిళా ప్రతినిధి కింబెర్లీ ఫార్ ఫోన్ బోర్ట్స్ తెలిపారు.

  • Loading...

More Telugu News