: చేతిలో చీపురు ఇమడలేదు: బాబా రాందేవ్
ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటులో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దోస్తీపై యోగా గురువు బాబా రాందేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ చేతిలో చీపురు ఎక్కువ కాలం ఇమడలేదని అన్నారు. షీలా దీక్షిత్ పై గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదైందన్న బాబా రాందేవ్... కేజ్రీవాల్ ఇంకా విచారణకు ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు.
సిక్కులను ఊచకోత కోసిన పార్టీలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ మోడీని వినాశకారి అనడం ఆశ్చర్యంగా ఉందని బాబా అన్నారు. మోడీకి తాము అంశాలవారీగా మద్దతు ఇస్తున్నామని తెలిపిన బాబా, దీనిపై రేపు అధికారిక ప్రకటన చేస్తామని తెలిపారు. అనంతరం దేశవ్యాప్తంగా మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై మద్దతు కూడగడతామని తెలిపారు.