: సోమవారానికి వాయిదాపడ్డ శాసనమండలి
శాసనసభ మాదిరిగానే శాసనమండలి కూడా సోమవారానికి వాయిదాపడింది. ఈ రోజు ప్రారంభమైన అనంతరం మండలి పలుమార్లు వాయిదా పడింది. సభలో ఎమ్మెల్సీలు ఛైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేస్తుండటంతో, మండలి ఛైర్మన్ చక్రపాణి వారిని సముదాయించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. సభ ఎంతకూ అదుపులోకి రాకపోవడంతో, చివరకు సోమవారానికి వాయిదా వేశారు.