: అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య పోరాటం జరుగుతోంది: శ్రీధర్ బాబు


చిత్తశుద్ధితోనే తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తాను నిజమైన కాంగ్రెస్ కార్యకర్తనని... పొలిటికల్ మైలేజ్ కోసం తాను ఈ పని చేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య పోరాటం జరుగుతోందని అన్నారు. ఈ రోజు హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ప్రోరోగ్ ను అడ్డుకున్నప్పుడు, టీబిల్లును సభలో ప్రవేశపెట్టినప్పుడు తనవి డ్రామాలని ఎందుకనలేదని విమర్శకులను శ్రీధర్ బాబు ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News