: సందర్శకుడిని ఎత్తుకుపోయిన పులి
సందర్శకుడిని పులి ఎత్తుకుపోయింది. పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా సుందర్ బన్స్ అడవుల్లో ఇది జరిగింది. కొంతమంది వ్యక్తులు సిదుర్ కాతి నది వద్ద పీతలను పడుతుండగా.. ఇంతలో ఒక పులి చెట్లమాటు నుంచి వచ్చి ఇషాక్ లష్కర్ అనే వ్యక్తిని నోట కరచుకుని తీసుకెళ్లింది. మిగతావారు భయంతో పరుగులు తీసి పోలీసులకు సమాచారం అందించారు. అతడిని చంపి తిన్నదా? లేక అతడు ప్రాణాలతో తప్పించుకున్నాడా? తెలుసుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.