: తెలంగాణ నేతలకి విషయం అర్థంకావట్లేదు: ఎమ్మెల్యే విష్టు


కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తుగడ తెలంగాణ నేతలకి అర్థంకాక అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్టు అభిప్రాయపడ్డారు. శ్రీధర్ బాబును తెలంగాణ ప్రాంతంలో హీరోని చేసేందుకే ఈ సమయంలో శాఖమార్పు చేశారని అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో దామోదర, జానాలే కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కులుగా మారారని సీఎం తాజా చర్యతో శ్రీధర్ బాబు ఒక్కసారిగా హీరో అయ్యారని అన్నారు.

తనకు సన్నిహితుడైన శ్రీధర్ బాబుకు పదోన్నతి కల్పించి అతనిని హీరోని చేసిన సీఎం, సీమాంధ్రలో సమైక్యవాది అనిపించుకున్నారని అన్నారు. అలాగే శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారు కనుక చర్చ జరగాల్సిందేనన్న సంకేతాలను అధిష్ఠానానికి పంపి అక్కడ తన విశ్వసనీయతను కిరణ్ కుమార్ రెడ్డి చాటుకుంటున్నారని ఆయన అన్నారు. దీంతో సీఎం కిరణ్ ఒక్క దెబ్బకి మూడు పిట్టల్ని కొట్టారని విష్ణు తెలిపారు.

  • Loading...

More Telugu News