: కేజ్రీవాల్ బాటలో రాజస్థాన్ ముఖ్యమంత్రి
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచి వారిలో స్ఫూర్తి రగిలిస్తున్నారు. ప్రభుత్వ బంగళాను తీసుకునేందుకు కేజ్రీవాల్ నిరాకరించగా.. అదే బాటలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె నడిచారు. తన అధికారిక నివాసాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలని ఆమె నిర్ణయించారు. అంతేకాదు, తన భద్రతా సిబ్బందిని తగ్గించాలని ఆ రాష్ట్ర పోలీసు బాసుకు సూచించారు. అయితే, వసుంధరరాజె కార్యాలయం మాత్రం, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కంటే ముందే తమ ముఖ్యమంత్రి ఈ నిర్ణయాలు తీసుకున్నారని స్పష్టం చేసింది.